వైఎస్సార్ డిక్షన్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మలయాళ స్టార్ !

Mammoott

‘యాత్ర’ టీజర్‌ ఇప్పటికే రిలీజ్ అయి దివంగత నేత మాజీ ముఖ్య మంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డిగారి జ్ఞాపకాలను గుర్తు చేసింది. మమ్మూటీ వైఎస్ఆర్ పాత్రను పోషించబోతున్నారని తెలిసినప్పటినుండి ఈ బయోపిక్ పై అంచానాలు భారీగా పెరిగాయి.

తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం షూటింగ్ అయిపోగానే, మమ్మూటీ నేరుగా డబ్బింగ్ స్టూడియోకి వెళ్లి డబ్బింగ్ చెబుతున్నారు. వైఎస్ఆర్ డిక్షన్ కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే పంచెకట్టులో సూపర్ స్టార్ మమ్మూటీ ‘వైఎస్సార్‌’ బాడీ లాంగ్వేజ్ లో కనిపించారు. జగపతిబాబు, సుహాసిని, రావు రమేష్, అనసూయ, సచిన్ ఖేడేకర్ వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version