మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) సినిమా సంక్రాంతికి స్పెషల్ గా వచ్చింది. సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కాగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తో అలరిస్తోంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరును చూశామంటూ అభిమానులు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రీమియర్స్ పూర్తికాగానే మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది. చిరంజీవితో పాటు అనిల్ రావిపూడి, సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కేక్ కట్ చేసి స్వీట్స్ తినిపించుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఈ పెద్ద పండగకు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వాటిని అందుకుంది. మొత్తానికి ఈ సినిమాలో చిరంజీవి ట్రేడ్‌మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.
