మరో మైల్‌స్టోన్ దాటిన ‘మన శంకర వరప్రసాద్ గారు’.. నెక్స్ట్ టార్గెట్ ఆ మార్కే..!

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ చిత్రంలో వింటేజ్ చిరంజీవి తనదైన కామిక్ టైమింగ్‌తో ఇరగదీశాడు. చిరుని ఇలా చూడాలని అభిమానులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ వచ్చారు.

ఇక తమ అభిమాన హీరో నుంచి అదిరిపోయే బొమ్మ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారు. సినిమా రిలీజ్ అయి రెండు వారాలు దాటినా కూడా మన శంకర వరప్రసాద్ గారు సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఈ చిత్రం తాజాగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 4.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది.

దీంతో చిరు కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ ఈ చిత్రం అందుకుంది. ఇక నెక్స్ట్ టార్గెట్‌గా ఈ మూవీ 5 మిలియన్ డాలర్ల మార్క్‌ను ఎప్పుడెప్పుడు టచ్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేష్ క్యామియో పాత్రలో నటించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version