‘మన శంకర వర ప్రసాద్ గారు’ బుకింగ్స్ షురూ.. ఎక్కడంటే?

‘మన శంకర వర ప్రసాద్ గారు’ బుకింగ్స్ షురూ.. ఎక్కడంటే?

Published on Dec 31, 2025 1:00 AM IST

msg 7

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతి మూవీ “మన శంకర వర ప్రసాద్ గారు” బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మేకర్స్ వినూత్నంగా 15 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఓవర్సీస్‌లో ‘సరిగమ సినిమాస్’ సంస్థ జనవరి 11నే గ్రాండ్ ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

​చిరంజీవిని అత్యంత స్టైలిష్ అవతారంలో చూపిస్తూ అనిల్ రావిపూడి రూపొందించిన ప్రోమోలు ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఈ చిత్రంలోని మొదటి రెండు సాంగ్స్ చిరంజీవి-నయనతార కెమిస్ట్రీతో అలరించగా, తాజాగా రిలీజ్ అయిన మెగా విక్టరీ మాస్ సాంగ్ సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. ఇందులో మెగాస్టార్‌తో కలిసి విక్టరీ వెంకటేష్ స్టెప్పులేయడం అభిమానులకు అసలైన పూనకాలు తెప్పించే అంశం. ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

​అనిల్ రావిపూడికి గతంలో సంక్రాంతి సీజన్లలో మంచి ట్రాక్ రికార్డ్ ఉండటం, దానికి మెగాస్టార్ ఇమేజ్ తోడవ్వడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విదేశాల్లోనూ భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా, సంక్రాంతి పండుగ వేళ కుటుంబ సమేతంగా చూడదగ్గ కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా నిలవనుంది.

తాజా వార్తలు