మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రమే ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu). ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ రీజనల్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి దూసుకెళ్తుంది.
అయితే సంక్రాంతి మూమెంట్ అయ్యినప్పటికీ మొన్న సోమవారం సాలిడ్ వసూళ్లు ఈ సినిమా అందుకుంది. ఇక నెక్స్ట్ మంగళవారంకి వస్తే డ్రాప్ బాగా కనిపించింది. కానీ అయినప్పటికీ ఉన్న అన్ని సంక్రాంతి సినిమాల్లో కూడా మన శంకర వర ప్రసాద్ గారు మాత్రమే బెస్ట్ పెర్ఫామెన్స్ ని చేస్తుంది.
మిగతా అన్ని సినిమాలు హవర్లీ బుకింగ్స్ లో కనిపించడం లేదు కానీ ఒక్క మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఈ వీక్ డేస్ లో కూడా ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ గా నిలిచింది అని చెప్పొచ్చు. అలాగే రేపు గురువారం నుంచి ఏపీలో టికెట్ ధరలు కూడా తగ్గనున్నాయి. సో ఇవి వీకెండ్ లో ప్రభావం చూపించవచ్చు. ఇక అప్పుడు ఈ సినిమా పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.


