మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కు రెడీ అయింది. ఓవర్సీస్ మార్కెట్‌లో చిరంజీవి కెరీర్‌లోనే కొత్త బెంచ్‌మార్క్‌ను ఈ సినిమా నమోదు చేసింది. అమెరికాలో అడ్వాన్స్ ప్రీ-సేల్స్‌లో 500K డాలర్ల మార్క్‌ను అత్యంత వేగంగా దాటేసి, ఆయన గత చిత్రాలన్నింటినీ వెనక్కి నెట్టేసింది.
అడ్వాన్స్ బుకింగ్స్‌ను ముందుగానే ఓపెన్ చేయడంతో సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇంకా రిలీజ్ కాకముందే ఇలా ప్రీ-సేల్స్‌లో చిరు తన సత్తా చాటుతుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమాను చూసేందుకు భారీగా ఆసక్తిని చూపుతున్నారు.
ప్రీమియర్ షోలు మరియు ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి భారీ నంబర్లను టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చిరంజీవి కెరీర్‌లో ఈ మూవీ టాప్ ఓపెనర్లలో ఒకటిగా నిలవొచ్చని పలువురు భావిస్తున్నారు. ఓవర్సీస్ రిలీజ్‌ను సరిగమ సినిమాస్ నిర్వహిస్తుండగా, రికార్డు స్థాయి అంచనాలతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ తన బాక్సాఫీస్ ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది.


