‘మన శంకర వరప్రసాద్ గారు’ టేకోవర్.. క్లియర్ డామినేషన్ తో బాస్!

Mana Shankara Varaprasad Garu

సంక్రాంతి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu )కూడా ఒకటి. దర్శకుడు అనీల్ రావిపూడి కలయికలో చేసిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భారీ ఓపెనింగ్స్ ని సాధించింది. వర్కింగ్ డేనే రిలీజ్ అయినప్పటికీ 80 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టి సెన్సేషన్ సెట్ చేసింది.

ఇక రెండో రోజు కూడా వర్కింగ్ డే అయినప్పటికీ కొత్త రిలీజ్ లు కూడా ఉన్నప్పటికీ బుకింగ్స్ లో మన శంకర వరప్రసాద్ గారు టేకోవర్ కనిపిస్తుంది. గంటకి 20 వేలకి పైగా టికెట్స్ బుకింగ్ అవుతూ క్లియర్ డామినేషన్ కి గట్టి మార్జిన్ తో ఈ సినిమా చూపిస్తుంది. ఇక ఇవాళే ఇలా ఉంటే రేపు సంక్రాంతి హాలిడేస్ లో ర్యాంపేజ్ ఇంకో లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో నయనతార, వెంకీ మామ కూడా నటించగా భీమ్స్ సంగీతం అందించాడు. అలాగే సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాణం వహించారు.

Exit mobile version