తన స్వాగ్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న శంకర వరప్రసాద్ గారు..!

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో వింటేజ్ లుక్స్‌తో చిరు చేయబోయే సెన్సేషన్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక రీసెంట్‌గా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవగా, దానికి ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. మెగాస్టార్ మరోసారి తనదైన మ్యానరిజం, పర్ఫార్మె్న్స్‌తో ట్రైలర్‌లో చెలరేగిపోయాడు. అనిల్ రావిపూడి మార్క్ టేకింగ్, కామెడీ టైమింగ్‌తో సాగే ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ ట్రైలర్‌కు ఫిదా అవుతున్నారు. రిలీజ్ అయిన 24 గంటల్లో ఈ ట్రైలర్‌కు ఏకంగా 25 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. దీంతో ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి ఫీట్‌లు చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటించగా, స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఓ క్యామియో పాత్రలో అదరగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ చిత్రం జనవరి 12న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయింది.

Exit mobile version