
మనం సినిమా 50 రోజుల వేడుకని అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని కుటుంబమంతా కలిపి జరుపుకున్నారు. ఈ కుటుంబంలో దాదాపు ప్రతీఒక్కరూ ఈ వేడుకకు హాజరయ్యి సంతోష సమయం పాలుపంచుకున్నారు
నాగార్జున, అమల, సుప్రియ యార్లగడ్డ వంటి ప్రముఖులు అతిధులను ఆహ్వానించారు. నటులకు, టెక్నీషియన్లకి, పంపిణీదారులకి ప్రత్యేక మెమెంటోలు అందించారు.
అక్కినేని వంశంనుండి వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో మనం ఒకటి. ఈ సినిమాకు విక్రం కుమార్ అందించిన కధ దాన్ని తీర్చిదిద్దిన విధానం సినిమాకు ఎంతో బలాన్ని చేకూర్చింది.