
అక్కినేని ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలైన ఎఎన్ఆర్, నాగార్జున, నాగ చైతన్యలతో పాటు నవతరం హీరో అక్కినేని అఖిల్ కూడా నటించిన సినిమా ‘మనం’. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇటు ఆంధ్రప్రదేశ్, ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. యుఎస్ లో కేవలం రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది.
ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూసి మరో రెండు రోజుల్లో 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఇప్పటివరకూ యుఎస్ బాక్స్ ఆఫీసు కొల్లగొట్టిన తెలుగు సినిమాల లిస్టు లో చేరుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
‘మనం’ యుఎస్ కలెక్షన్స్ వివరాలు మీకోసం ..
గురువారం (ప్రీమియర్ షోస్) – $ 95, 473
శుక్రవారం – $ 213,511
శనివారం – $ 260,327
మొత్తం – $ 569,311 (ఇండియన్ రూపీ ప్రకారం సుమారు 3.33 కోట్లు)

