
అక్కినేని కుటుంబం నుండి మూడు తరాల హీరోలు నటించిన సినిమా ‘మనం’. మేము మా రివ్యూలో పేర్కొన్న మాదిరిగానే గురువారం ప్రపంచవ్యాప్తంగా వేసిన స్పెషల్ ప్రీమియర్ షోలు చుసిన వారి నుండి అధ్బుతమైన స్పందన వస్తుంది. ‘మనం’ సినిమా ఒక ఆణిముత్యం, స్వర్గీయ అక్కినేని నాగేశ్వర్ రావు గారికి ఇంతకంటే గొప్ప నివాళి ఉండదు. నాన్న ఆఖరి సినిమా అవడంతో, ఈ సినిమాకు వస్తున్న స్పందనను చూసి హీరో నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సినిమాకి నాగేశ్వర్ రావు గారి నటన ఒక హైలైట్.
సినిమాను అధ్బుతంగా మలిచిన దర్శకుడు విక్రం కుమార్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. ‘మనం’ ఒక పెద్ద కమర్షియల్ హిట్ తో పాటు, తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అద్భుతమైన మల్టీ స్టారర్ గా నిలిచిపోతుంది.