ఎఎన్ఆర్ ని తెరపై చూసే చివరి అవకాశం ‘మనం’ – నాగ్

Nagarjuna-Exclusive-Still-F
తెలుగు చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటులలో ఒకరైన లెజెండ్రీ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ‘మనం’. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు మరియు తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తెలుగు ప్రజల అందరి గుండెల్లోనూ నిలిచిపోయేలా చేయాలని ఈ చిత్ర టీం ప్రయత్నాలు చేస్తోంది.

అక్కినేని నాగేశ్వరరావుని తెరపై చూసే చివరి అవకాశం ‘మనం’ సినిమానే అని నగేజున అన్నాడు. అలాగే మా తండ్రి గారికి ఫేర్ వెల్ కి పర్ఫెక్ట్ గా సరిపోయే సినిమా ఇదని ఆయన అన్నారు. ఇష్క్ సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు.

అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించడానికి పర్ఫెక్ట్ కథ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనం కథ వచ్చింది. అది వినగానే వెంటనే ఓకే చేసేసానని నాగార్జున ఇది వరకే తెలిపారు. ఎఎన్ఆర్ తో పాటుగా నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఈ సినిమాలో సమంత, శ్రియ సరన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Exit mobile version