నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన ‘మనం’

నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన ‘మనం’

Published on Jun 13, 2014 5:08 PM IST

manam
అక్కినేని ఫ్యామిలీ హీరోలైన స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. ఈ సినిమా మే 23న విడుదలై అక్కినేని ఫ్యామిలీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నైజాంలో సరికొత్త రికార్డ్ ని సృష్టించింది. ఈ సినిమా విడుదలైన 21 రోజుల్లో ఒక్క నైజాంలో 10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. అక్కినేని ఫ్యామిలీ హీరోలకి నైజాంలో ఇంత కలెక్షన్స్ రావడం ఇదే మొదటిసారి.

అక్కినేని మూడు తరాల హీరోలు నటించడంతో పాటు అఖిల్ అక్కినేని కూడా చివర్లో కనిపించడం ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత, శ్రియ హీరోయిన్స్ గా నటించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ ఓవరాల్ కలెక్షన్స్ పరంగా కూడా అక్కినేని ఫ్యామిలీ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

తాజా వార్తలు