‘రకుల్’ బ్యాచిలర్ పార్టీలో మంచు లక్ష్మి

‘రకుల్’ బ్యాచిలర్ పార్టీలో మంచు లక్ష్మి

Published on Feb 5, 2024 9:30 PM IST

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 21న గోవాలో ఆమె ప్రియుడు జాకీ భగ్నానీని వివాహమాడబోతుంది. ఈ క్రమంలో తన స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది రకుల్. థాయ్ లాండ్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు. రకుల్ కి మంచు లక్ష్మి చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందే. మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోట్టబోతుంది.

రకుల్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరిగాయి. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వెడ్డింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి కోసం ప్రత్యేక పాటలకు ట్యూన్ చేస్తున్నట్లు.. విశాల్ పంజాబీ ఈ సౌండ్ ట్రాక్స్ రెడీ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. నిజానికి గత కొన్ని నెలలుగా రకుల్ పెళ్లి టాపిక్ ట్రెండింగ్ అవుతూనే ఉంది. అన్నట్టు తన రిలేషన్ షిప్ ను సోషల్ మీడియా వేదికగా రకుల్ చాలా ముందుగానే ప్రకటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు