నిర్మాతగా చాప్టర్ ముగిసింది అంటున్న మంచు లక్ష్మి! అప్పటి అప్పులే ఇంకా

నిర్మాతగా చాప్టర్ ముగిసింది అంటున్న మంచు లక్ష్మి! అప్పటి అప్పులే ఇంకా

Published on Feb 18, 2026 2:01 AM IST

Lakshmi-Manchu

మన తెలుగు సినిమా దగ్గర నటన నుంచి మొదలు పెట్టి దర్శకత్వం, నిర్మాణ రంగంలో కూడా రాణించిన నటీనటులు ఉన్నారు. అయితే వీరిలో మంచు వారి కుటుంబం నుంచి వచ్చిన నటి మంచు లక్ష్మి కూడా ఒకరు. మంచు లక్ష్మి నటనతో పాటుగా పలు సినిమాలకి నిర్మాణం కూడా వహించారు.

అయితే నటిగా చాలా సినిమాల్లో మెప్పించిన తాను నిర్మాతగా మాత్రం అనుకున్న రేంజ్ లో హిట్స్ అందుకోలేదు. ఇక మరీ ముఖ్యంగా అయితే ఐదేళ్ల కితం చేసిన ఓ సినిమా వల్ల మిగిలిన నష్టాలు దెబ్బకి ఇప్పటికీ ఆ అప్పులు కట్టుకుంటునాన్ను అని లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో తెలిపారు.

అంతే కాకుండా తన జీవితంలో ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది ముగిసిపోయింది అని కేవలం నటన మాత్రమే కొనసాగిస్తాను అని ఆమె తెలిపారు. అలాగే ఎవరైనా స్క్రిప్ట్ పంపినా కూడా నిర్మాత ఎవరు అని వాళ్ళతోనే రండి అని నేనే అడుగుతున్నాను అని ఆమె తెలిపారు. సో మరి ఆ ఐదేళ్ల కితం సినిమా ఎఫెక్ట్ మాత్రం ఆమెపై గట్టిగానే ఉందని చెప్పాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు