“మిరాయ్” నుంచి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ తో గ్లింప్స్ రిలీజ్ టైం ఫిక్స్

“మిరాయ్” నుంచి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ తో గ్లింప్స్ రిలీజ్ టైం ఫిక్స్

Published on May 19, 2024 1:00 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ సూపర్ హీరో తేజ సజ్జ (Teja Sajja) సెన్సేషనల్ సక్సెస్ “హను మాన్” తర్వాత చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ చిత్రమే “మిరాయ్”. టీజర్ తోనే మరోసారి పాన్ ఇండియా సినిమా దగ్గర వర్క్ అయ్యేలానే కనిపిస్తుంది. ఇక ఈ చిత్రం మన టాలీవుడ్ సూపర్ స్టైలిష్ యాక్షన్ చిత్రం “ఈగల్” దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఫైనల్ గా తనపై సాలిడ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేశారు. కత్తి పట్టుకొని “ది బ్లాక్ స్వార్డ్” గా పరిచయం చేశారు. అలాగే తనపై గ్లింప్స్ రిలీజ్ సమయాన్ని కూడా ఖరారు చేశారు. ఈ మే 20న ట్రిపుల్ ఏ సినిమాస్ లో ఉదయం 10 గంటల నుంచి లాంచ్ ఈవెంట్ స్టార్ట్ కాగా ఆన్ లైన్ లో ఈ గ్లింప్స్ 11 గంటల 34 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ టీజర్ గ్లింప్స్ ఎలా ఉంటుందో మనోజ్ ఏ లెవెల్లో కనిపిస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి కూడా హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరీష్ నే సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు