పోటుగాడు గా రానున్న మంచు మనోజ్

పోటుగాడు గా రానున్న మంచు మనోజ్

Published on Mar 19, 2013 3:20 PM IST

Manoj
వైవిధ్యమైన, ఆసక్తికరమైన సినిమాలలో నటించే మంచు మనోజ్ ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి ‘పోటుగాడు’ అనే పేరును పెట్టడం జరిగింది. మార్చి చివరి వారంలో షూటింగ్ ప్రారంభమయ్యే ఈ సినిమాకి పవన్ దర్శకత్వం వహించనున్నాడు. బిగ్ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని రామలక్ష్మీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది.ఈ సినిమాలో మనోజ్ తో నలుగురు హీరోయిన్స్ నటించనున్నారు. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా జోనర్ మనోజ్ కి బాగా సరిపోతుంది. ‘పోటుగాడు’ సినిమాని వేగంగా షూటింగ్ జరిపి ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి, మిగిలిన తారల గురించి అధికారికంగా త్వరలో తెలియజేసే అవకాశం ఉంది. .
ఈ సందర్భంగా కొత్త సినిమాలో నటించనున్న మనోజ్ కి అల్ ది బెస్ట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు