“మిరాయ్” సెట్స్ లో జాయిన్ అయిన మంచు మనోజ్!

“మిరాయ్” సెట్స్ లో జాయిన్ అయిన మంచు మనోజ్!

Published on Apr 22, 2024 2:30 PM IST

హను మాన్ మూవీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ మిరాయ్ చిత్రం లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన టైటిల్ గ్లింప్స్ వీడియో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, నటుడు ఇటీవలే మిరాయ్ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఇదే విషయాన్ని పరోక్షంగా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. గౌర హరి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 18, 2025న 7 భాషల్లో సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు