నేడు మనోజ్, ప్రణతిల నిశ్చితార్థం

Manoj-pranitha
సినీ హీరో, మోహన్‌బాబు చిన్న కుమారుడైన మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల నిశ్చితార్థ వేడుక నేడు జరగనుంది. ఉదయం 10:30కు హైద్రాబాద్ బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో ఈ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖర్‌రావు లు హాజరవుతున్నట్టు సమాచారం. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్న సందర్భంగా హోటల్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తును ఏర్పాటు చేశారు.

కాగా.. మంచు మనోజ్ తన స్నేహితురాలైన ప్రణతిరెడ్డిని వివాహమాడనున్న సంగతి తెలిసిందే. ప్రణతి రెడ్డి బిట్స్‌పిలానీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. మంచు విష్ణు భార్య వెరానికా, ప్రణతిలు క్లాస్‌మేట్స్ అన్న సంగతీ తెలిసిందే!

తమ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి రానున్న సందర్భంగా మోహన్‌బాబు ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ప్రణతిరెడ్డిని తన మూడో కూతురుగా పేర్కొన్నారు. మంచు లక్ష్మి, వెరానికాలతో పాటు ప్రణతీ తన కూతురేనని ఆయన తెలిపారు.

Exit mobile version