“మిరాయ్” నుండి మంచు మనోజ్ లుక్ లాంఛ్ ఈవెంట్ కి టైమ్ ఫిక్స్!

“మిరాయ్” నుండి మంచు మనోజ్ లుక్ లాంఛ్ ఈవెంట్ కి టైమ్ ఫిక్స్!

Published on May 18, 2024 11:00 PM IST

హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ మిరాయ్ చిత్రం లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన టైటిల్ గ్లింప్స్ వీడియో ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మంచు మనోజ్ ది బ్లాక్ స్వార్డ్ గా కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

అయితే ఈ ఫస్ట్ లుక్ కోసం మేకర్స్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. మే 20, 2024 న ఉదయం 10:30 గంటలకు AAA సినిమాస్ లో ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఈ పాత్రకు సంబందించిన మరిన్ని వివరాలు ఆరోజు వెల్లడి కానున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. గౌర హరి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 18, 2025న 7 భాషల్లో సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు