“మిరాయ్” నుండి మంచు మనోజ్ రోల్ అప్డేట్ కి రెడీ!

“మిరాయ్” నుండి మంచు మనోజ్ రోల్ అప్డేట్ కి రెడీ!

Published on May 17, 2024 8:01 PM IST

హను మాన్ మూవీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ పాన్ ఇండియా మూవీ మిరాయ్ చిత్రం లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన టైటిల్ గ్లింప్స్ వీడియో ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

మంచు మనోజ్ ఈ చిత్రంలో ది బ్లాక్ స్వార్డ్ గా కనిపించనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. అయితే మే 20, 2024 న ఈ పాత్రకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. ఇలాంటి చిత్రం లో మంచు మనోజ్ రోల్ ఎలా ఉండబోతుంది అనే దానిపై మరింత ఆసక్తి నెలకొంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. గౌర హరి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 18, 2025న 7 భాషల్లో సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు