బ్రేక్ లేకుండా మంచు విష్ణు యాక్షన్..

vishnu123
మంచు విష్ణు, ప్రణిత జంటగా దేవా కట్టా దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఫిబ్రవరి ఆరంభంలో ప్రారంభమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఇంకా కొనసాగుతుంది. వాలంటైన్స్ డేకి కూడా బ్రేక్ తీసుకోలేదు. హీరో హీరోయిన్లతో పాటు ఇతర తారాగణం షూటింగులో పాల్గొంటున్నారు. విజయ్ మాస్టర్ యాక్షన్ కోరియోగ్రఫీ చేస్తున్నారు.

మంచు మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు, తన ఎడమ చేతిపై ఓ భారి టాటూ (పచ్చబొట్టు) వేయించుకున్నారు. క్యారెక్టర్లో ఇంటెన్సిటీని ఆ టాటూ బాగా ఎలివేట్ చేస్తుందని దర్శకుడు కన్వీన్స్ చేయడంతో విష్ణు ఓకే చెప్పారు. తమిళ సినిమా ‘అరిమ నంబి’కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.

Exit mobile version