కరోనాపై వింత ప్రశ్న సంధించిన మంచు విష్ణు.!

Published on Apr 10, 2021 9:00 am IST

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా నటించిన “మోసగాళ్లు” చిత్రం విడుదలై అనుకోని రీతి విజయాన్ని నమోదు చేయలేకపోయిన సంగతి తెలిసిందే. అప్పటికి కరోనా ఉదృతి తక్కువ గానే ఉన్నా ఇప్పుడు చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు కానీ ఇతర కొన్ని రాష్ట్రాల్లో అయితే సెకండ్ వేవ్ భారీ ఎత్తున ఉన్న సంగతి చూస్తూనే ఉన్నాము.

మరి దీనిపైనే మంచు విష్ణు ఓ వింత ప్రశ్న సంధించాడు.”చాలా రాష్ట్రాల్లో కోవిడ్ వల్ల రాత్రి కర్ఫ్యూ విధించారు, కోవిడ్ రాత్రి సమయాల్లోనే వ్యాప్తి చెందుతుందా? జస్ట్ అడుగుతున్నా” అన్నట్టుగా తన డౌటానుమానాన్ని అలా సోషల్ మీడియాలో వేసేశాడు. మరి ఇది ఒకింత లాజికల్ అనే చెప్పాలి. ఇక ఇది పోతే ప్రస్తుతం విష్ణు మళ్ళీ తన కం బ్యాక్ ఇచ్చేందుకు తన హిట్ దర్శకుడు శ్రీ వైట్ల తోనే “ఢీ 2″(డబుల్ డోస్) తీస్తున్న సంగతి తెలిసిందే. మరి దీనితో అయినా మంచు విష్ణు మంచి కం బ్యాక్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :