కొంతకాలం విరామం తరువాత దాసరి నారాయణరావుగారు తన 151వ ప్రయత్నంగా మంచు విష్ణుతో తెరకెక్కించిన ఎర్ర బస్సు సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ మేరకు మంచు విష్ణు చెప్పిన ముచ్చట్లని విందామా..
ఎర్రబస్సు తమిళ రీమేక్ అయినప్పటికీ అవసరమైన మార్పులు తెలుగులో చేసామని తెలిపారు. గురువుగారి దగ్గర నటిస్తున్నావ్ జాగ్రత్త అని డాడీ జాగ్రత్తచెప్పినట్టు అయితే దాసరి సౌమ్య శీలి, ఆయన దగ్గర విషయాలు నేర్చుకోవడం అంటే యువ క్రికెటర్ సచిన్ దగ్గర పాఠాలు నేర్చుకున్నట్టే అని చెప్పుకొచ్చారు
తన సినిమాలన్నిటిలో ఫ్యామిలీ టచ్ వుంటుందని, ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా సినిమాలు సరైన ఉదాహరణలని గుర్తుచేశారు ప్రస్తుతం ‘ఢీ 2’ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు, అన్నీ సెట్ అయితే రాఘవేంద్రరావు గారితో తన కలల ప్రాజెక్ట్ ‘రావణ’ కూడా త్వరలో ప్రారంభంకానుందని తెలిపారు


