త్వరలో పూర్తి కానున్న వర్మ – విష్ణుల మూవీ

త్వరలో పూర్తి కానున్న వర్మ – విష్ణుల మూవీ

Published on Jul 7, 2014 1:37 PM IST

manchu-vishnu-rg

ప్రస్తుతం హిట్స్ లేదా ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈ వారాంతంలో ఆయన తీసిన ‘ఐస్ క్రీమ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కాకుండా ఎప్పుడో పూర్తైన ‘పట్ట పగలు’ సినిమా ఆగష్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి రెండు కాకుండా మంచు విష్ణు హీరోగా చేస్తున్న సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ’12’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇందులో మంచు విష్ణు సరసన తేజస్వి నటిస్తుండగా, మధు శాలిని ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. గతంలో విష్ణు – వర్మ కాంబినేషన్లో ‘రౌడీ’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో విష్ణు నటనకి మంచి మార్కులు పడ్డాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు