
సినిమా సినిమాకి ఏదో ఒక కొత్తదనం ట్రై చేస్తున్న మంచు వారబ్బాయి మంచు విష్ణు ప్రస్తుతం విభిన్న చిత్రాల దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో పరిగెత్తించే స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చేజింగ్ సీక్వెన్స్ లు, యాక్షన్ ఎపిసోడ్స్ బాగానే ఉంటాయని సమాచారం. ప్రస్తుతం విష్ణు పై కొన్ని చేజింగ్ సీక్వెన్స్ లను రామోజీ ఫిల్మ్ సిటీలోని పలు లొకేషన్స్ లో షూట్ చేస్తున్నారు. ఈ చేజ్ సీక్వెన్స్ లో కొంత యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది. ఈ టోటల్ చేజింగ్ పార్ట్ విజయన్ మాస్టర్ నేతృత్వంలో జరుగుతోంది.
మంచు విష్ణు సరసన ప్రణిత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రణిత గ్లామర్ డాల్ గానే కాకుండా కథలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇంకా చెప్పాలి అంటే కథ మొత్తం ప్రణిత చుట్టూనే తిరుగుతుంది. మంచు మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం మంచు విష్ణు, తన ఎడమ చేతిపై ఓ భారి టాటూ (పచ్చబొట్టు) వేయించుకున్నారు. క్యారెక్టర్లో ఇంటెన్సిటీని ఆ టాటూ బాగా ఎలివేట్ చేస్తుందని దర్శకుడు చెప్పడంతో విష్ణు ఓకే చెప్పారు. తమిళ సినిమా ‘అరిమ నంబి’కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు.