ఊహించని లెవెల్లోకి మారుతున్న “కన్నప్ప”.. సీన్ లోకి అక్షయ్ కుమార్

ఊహించని లెవెల్లోకి మారుతున్న “కన్నప్ప”.. సీన్ లోకి అక్షయ్ కుమార్

Published on Apr 16, 2024 11:03 AM IST


టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు వారి యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా తన కెరీర్ డ్రీం ప్రాజెక్ట్ గా చేస్తున్న భారీ చిత్రం “కన్నప్ప” కోసం తెలిసిందే. ఇండియా లోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలా మారుతున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్ సహా ఎందరో దిగ్గజ నటులు నటిస్తుండగా ఇప్పుడు ఈ సినిమా మరింత గ్రాండ్ గా మారుతుంది.

తాజాగా ఈ సినిమాలోకి బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ జాయిన్ అవ్వడానికి హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వడం ఒక ఊహించని అంశంగా మారింది. ఈ సినిమాలో కీలక క్యామియోలో అయితే అక్షయ్ కనిపించనున్నారని అందుకే హైదరాబాద్ కి తాను వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి అక్షయ్ కి మంచు విష్ణు ఆహ్వానం పలుకగా ఈ విజువల్స్ సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి.

మరి వీరి కలయికలో ఎలాంటి సీన్స్ ఉంటాయో చూడాలి. ఈ చిత్రానికి ఇండియాస్ ఫేవరెట్ సీరియల్ మహాభారతం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా అక్షయ్ కుమార్ ఈ చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నారు. అలాగే మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మోహన్ బాబు ఈ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు