కోలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి రోజు నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అనూహ్యంగా పుంజుకుని సంచలనం సృష్టిస్తోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో తొలి వారాంతంలోనే ఏకంగా రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అదరగొట్టింది. రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతూ వస్తుండటంతో నేడు చాలా ప్రాంతాల్లో ఈ చిత్రానికి హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి.
మధిమరన్ పుగజేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ఫుల్ రన్‌లో ఏపీ, తెలంగాణలో రూ. 15 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
