“మంగళవారం” టీవీ పార్టనర్ ఫిక్స్!

“మంగళవారం” టీవీ పార్టనర్ ఫిక్స్!

Published on Dec 10, 2023 9:00 PM IST

పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో నటించిన మంగళవారం సినిమా రీసెంట్ గా ఆడియెన్స్ ముందుకొచ్చి ఘన విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు అజయ్ భూపతి మంగళవారం సినిమాను రూపొందించారు. నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ సినిమా త్వరలో డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది.

అయితే ఈ సినిమా తాజాగా టీవీ పార్టనర్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఛానెల్ ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఓటిటి లో మరియు టీవీ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు