“మంగళవారం” ఫస్ట్ టెలికాస్ట్ అఫీషియల్ టీఆర్పీ రేటింగ్

“మంగళవారం” ఫస్ట్ టెలికాస్ట్ అఫీషియల్ టీఆర్పీ రేటింగ్

Published on Feb 27, 2024 1:05 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో తన డెబ్యూ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన రీసెంట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “మంగళవారం”. మరి సాలిడ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అన్ని అంచనాలు అందుకొని మంచి వసూళ్లతో కూడా అదరగొట్టింది.

మరి ఈ చిత్రం థియేటర్స్ తర్వాత ఓటిటిలో కూడా రిలీజ్ కాగా అందులోని అద్భుతమైన స్పందన అందుకుంది. అయితే రీసెంట్ గా స్టార్ మా టెలికాస్ట్ అయ్యిన ఈ చిత్రం తాలూకా ఫస్ట్ టైం టెలికాస్ట్ టీఆర్పీ రేటింగ్ బయటకి వచ్చింది. మరి దీని ప్రకారం ఈ చిత్రం మొదటిసారి 8.3 రేటింగ్ పాయింట్స్ ని రాబట్టినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.

మరి రీసెంట్ టైం లో అయితే ఇది సాలిడ్ నెంబర్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా అజయ్ భూపతి సహా మధుర మీడియా వర్క్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు