వరల్డ్ వైడ్ “మంగళవారం” 10 రోజుల వసూళ్లు..!

వరల్డ్ వైడ్ “మంగళవారం” 10 రోజుల వసూళ్లు..!

Published on Nov 28, 2023 11:00 AM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి మరియు టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఇంటెన్స్ సాలిడ్ థ్రిల్లర్ చిత్రం “మంగళవారం”. మరి క్రేజీ హైప్ తో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అంచనాలు అందుకొని మంచి హిట్ గా నిలిచింది. ఇక డే 1 నుంచి కూడా మంచి వసూళ్ళని అందుకుంటున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇపుడు 10 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది.

ఇక ఈ పది రోజుల్లో అయితే ఈ సినిమా మొత్తం 22.03 కోట్ల గ్రాస్ ని అందుకుని మంచి స్టాండర్డ్ గా వెళ్తుంది. మరి ఫైనల్ రన్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా “కాంతార” సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ క్రేజీ మ్యూజిక్ బీట్స్ అందించగా మధుర మీడియా వర్క్స్ మరియు ఏ క్రియేటివ్ వర్క్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు