
సౌత్ ఇండియన్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం.. గతంలో ఎన్నో మరపురాని సినిమాలను అందించిన మణిరత్నంకి గత కొంతకాలంగ హిట్ లేదు. అలాంటిది చాలా రోజుల తర్వాత ఈ ఏడాది ‘ఓకే కన్మణి లేదా ఓకే బంగారం’ సినిమాతో హిట్ అందుకున్నాడు మణిరత్నం. ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఎనర్జీతో మణిరత్నం తన తదుపరి సినిమా కోసం సిద్దమవుతున్నాడు. అందుకోసం ఓ క్రేజీ కాంబినేషన్ ని కూడా సెట్ చేసాడు. అదే తమిళ యంగ్ హీరో కార్తీ – మలయాళ యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్. గత కొద్ది రోజులుగా మణిరత్నం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.
ఇన్ని రోజులు ఈ సినిమా పై అధికారిక ప్రకటన లేదు. తాజాగా మణిరత్నం ఈ సినిమాపై కామెంట్ చేసాడు. డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్న ఈ సినిమాని 2016 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మణిరత్నం ఒకేసారి తమిళ్ – మలయాళ భాషల్లో షూట్ చేయనున్నారు. ఈ ద్విభాషా చిత్రం మలయాళ వెర్షన్ లో మమ్ముట్టి ఓ మెయిన్ రోల్ లో కనిపించనున్నాడు. తమిళ్, మలయాళంతో పాటు తెలుగులో కూడా కార్తీ, మణిరత్నం సినిమాలకి మంచి క్రేజ్ ఉండడం వలన తెలుగులో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తారు. నయనతార, శృతి హాసన్ లు హీరోయిన్ గా ఫైనలైజ్ అయిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనున్నాడు.

