
సౌత్ ఇండియన్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం ప్రసతుతం ఓ రొమాంటిక్ లవ్ స్టొరీని సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాలో మలయాళ యంగ్ సూపర్ స్టార్ దల్క్వేర్ సల్మాన్ హీరోగా నటిస్తుండగా, నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించనుంది.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసం మణిరత్నం ప్రకాష్ రాజ్ ని సెలక్ట్ చేసాడు. ప్రకాష్ రాజ్ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. త్వరలోనే ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమాని ఒకేసారి తమిళం, మళయాళ భాషల్లో తెరకెక్కించనున్నారు. మణిరత్నం ముందుగా ఇదే కథని చిరంజీవి – రామ్ చరణ్ లతో చేయాలనుకొని కథ చెప్పాడు. కానీ చిరు తమకు సెట్ అవ్వదని సున్నితంగా తిరష్కరించడంతో మణిరత్నం ఇప్పుడు దల్క్వేర్ సల్మాన్ తో చేస్తున్నాడు.