మణిరత్నం బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ రొమాన్స్ – పిసి శ్రీరామ్

pc-sri-ram-maniratnam
రొమాంటిక్ ఫిల్మ్స్ తీయడం మణిరత్నం బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. హృద్యమైన ప్రేమకథలను వెండితెరపై అందంగా ఆవిష్కరించడంలో మణిరత్నం సిద్దహస్తుడు. అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ తెలిపారు. మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘ఒకే బంగారం’కు పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. 15 ఏళ్ళ తర్వాత వీరిద్దరూ కలిసి పని చేసిన సినిమా ఇది.

దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలవుతుంది. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రల్లో నటించారు. తమిళంలో ‘ఒకే కన్మణి’ పేరుతో తెరకెక్కించారు. మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ తెలుగులో సినిమాను విడుదల చేస్తుంది.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. త్వరలో ఆడియో విడుదల తేదిను వెల్లడించనున్నారు. తమిళంలో సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ఈ సినిమాను నిర్మించారు.

Exit mobile version