
‘ఓకే బంగారం’ వంటి మంచి రొమాంటిక్ కథ తో విజయం సాధించిన స్టార్ దర్శకుడు మణి రత్నం కొత్త చిత్రం ప్రారంభించడానికి కొంత సమయం తీసుకున్నారు. కొంతకాలం క్రితం కార్తీ తో తదుపరి చిత్రం చేయనున్నారని వార్తలు వచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగస్ట్ చివరి వారంలో కాని సెప్టెంబర్ మొదటి వారంలో కాని ప్రారంభం కానుంది. కార్తీ తన కెరీర్ ని మణి దగ్గర శిష్యుడిగా ప్రారంభించిన విషయం తెలిసిందే. తన శిష్యుడిని ఈ మాస్టర్ దర్శకుడు ఎలా చిత్రీకరిస్తారో వేచి చూడాల్సిందే. ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో మమ్ముటి ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు.