మణిరత్నం సినిమా కోసం మరొక లెజెండ్

Published on Sep 10, 2019 1:14 am IST

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఏ సినిమా చేసినా వాటికి పెద్ద పెద్ద టెక్నీషియన్లు వర్క్ చేయడం పరిపాటి. దక్షిణాదిన ఉన్న దాదాపు పేరున్న ప్రతి పెద్ద సాంకేతిక నిపుణుడితో పనిచేసిన మణిరత్నం కొత్తగా చేస్తున్న భారీ మల్టీస్టారర్ ‘పొన్నియన్ సెల్వన్’ కోసం అలాంటి టెక్నీషియన్లనే ఎంచుకున్నారు.

ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ అందిస్తుండగా కళా దర్శకుడిగా తోట తరణి వ్యవహరించనున్నారు. గతంలో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘నాయకన్, దళపతి’ లాంటి చిత్రాలకు పనిచేశారు తోట తరణి. ఆ సినిమాలకు నేషనల్ అవార్డ్, తమిళనాడు స్టేట్ అవార్డ్స్ రావడం జరిగింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాలో జయం రవి, విక్రమ్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి లాంటి స్టార్లు నటించనున్నారు. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More