“నవరస” వెబ్ సిరీస్ కు డేట్ ఫిక్స్…ఎప్పుడంటే?

Published on Jul 5, 2021 11:59 pm IST

మణిరత్నం ఆలోచనతో వస్తున్న నవరస వెబ్ సిరీస్ విడుదల పై మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ను ఆగస్ట్ 9 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే అందుకు సంబంధించిన పోస్టర్ సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొమ్మిది మంది దర్శకులతో తమిళ్ లోని కీలక నటులతో ఈ వెబ్ సిరీస్ రూపొందించడం జరిగింది. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబందించిన టీజర్ ఈ వారం లోగా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ వెబ్ సిరీస్ 9 ఎపిసోడ్స్ గా రానుంది. ప్రియదర్శన్, వసంత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, బేజొయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజు, హలిత శమీం, కార్తిక్ నరేన్, అరవింద్ స్వామి, రతింద్రన్ ఆర్ ప్రసాద్ లు ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో సూర్య, రేవతి, సిద్దార్థ్, పార్వతీ తిరువొతు, పావెల్ నవగీతం, రాజేష్ బాలచంద్రన్, శ్రీ రామ్, అమ్ము అభిరామి, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మద్రాస్ టాకీస్, క్యూబ్ సినిమా టెక్నాలజీస్ ఈ వెబ్ సిరీస్ ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :