దాదాపు రెండు దశాబ్దాలు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ ని మణిశర్మ ఏలారు. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ,వెంకటేష్, ఎన్టీఆర్, మహేష్ లాంటి టాప్ స్టార్స్ మొదటి ఛాయిస్ మణిశర్మ మాత్రమే. ఐతే గత కొన్నాళ్లుగా మణిశర్మకు టాప్ హీరోల నుండి అవకాశాలు రావడం తగ్గింది. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ ఆల్బమ్ తో ఆయన ఫార్మ్ లోకి వచ్చారు. దీనితో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ తో చేస్తున్న చిత్రం కొరకు అతన్ని తీసుకోవడం జరిగింది.
ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ కొరకు దర్శకుడు కొరటాల తో కలిసి మణిశర్మ థాయిలాండ్ వెళ్లారు. ఒకప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరున్న చిరు కోసం మణిశర్మ అదిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారట. సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కమర్షియల్ మూవీ కావడంతో దానికి తగ్గట్టుగా ట్యూన్స్ సిద్ధం చేస్తున్నారట. మెలోడీ బ్రహ్మగా పేరున్న మణిశర్మ ఈ చిత్రం కోసం ఆకట్టుకొనే మెలోడీ డ్యూయట్స్ కూడా సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇంద్ర, ఠాగూర్, చూడాలనివుంది, అన్నయ్య, బావగారు బాగున్నారా వంటి చిత్రాలకు గతంలో మణిశర్మ సంగీతం అందించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం 2006లో వచ్చిన స్టాలిన్ కావడం విశేషం.
