యూఎస్ మార్కెట్ లో “మంజుమ్మల్ బాయ్స్” మరో సంచలనం

యూఎస్ మార్కెట్ లో “మంజుమ్మల్ బాయ్స్” మరో సంచలనం

Published on Apr 12, 2024 10:42 PM IST

మోలీవుడ్ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ ల కలయికలో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన హై ఎండ్ ఎమోషనల్ మరియు సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం “మంజుమ్మల్ బాయ్స్” (Manjummel Boys).

మరి మళయాళ సినిమా వద్ద సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో గతంలో ఏ మళయాళ సినిమా కూడా అందుకోని విధంగా మొట్ట మొదటిసారిగా 1 మిలియన్ క్లబ్ లో చేరి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు మరోసారి మరో మార్క్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఇటీవల తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ కావడంతో ఈ వసూళ్లు కూడా నార్త్ అమెరికాలో ప్లస్ అయ్యి 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. అలాగే మరిన్ని లొకేషన్స్ కూడా యాడ్ చేస్తున్నారట. దీనితో ఇప్పుడు ఈ చిత్రం 2 మిలియన్ మార్క్ ని అందుకే మొదటి మళయాళ సినిమాగా కూడా నిలవబోతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు