‘మంజుమ్మల్ బాయ్స్’ : తెలుగు వర్షన్ పెయిడ్ ప్రీమియర్స్ పై మేకర్స్ క్లారిటీ

‘మంజుమ్మల్ బాయ్స్’ : తెలుగు వర్షన్ పెయిడ్ ప్రీమియర్స్ పై మేకర్స్ క్లారిటీ

Published on Apr 4, 2024 2:00 AM IST

ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను డబ్ చేసి తెలుగులోకి కూడా తీసుకు రావడం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా 2018, ప్రేమలు సినిమాలు తెలుగులో రిలీజ్ అయి సూపర్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన మరొక సినిమా మంజుమ్మల్ బాయ్స్. ఫిబ్రవరి 22న మలయాళంలో రిలీజయిన ఈ మూవీ అక్కడ పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

కేవలం రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కలిసి తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగులో ఏప్రిల్ 6న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాగా దానికి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సౌబిన్ సాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు.. పలువురు మలయాళ యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. విషయం ఏమిటంటే, నేడు జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగముగా మైత్రి శశి మాట్లాడుతూ పెద్ద సినిమాలే కాకుండా దాదాపు 250 నుండి 300 థియేటర్లలో మంజుమ్మల్‌ బాయ్స్‌ని విడుదల చేస్తున్నాం. అలానే తొలిసారిగా మలయాళ డబ్బింగ్ చిత్రం తెలుగులో ఏప్రిల్ 5న పెయిడ్ ప్రీమియర్లను ప్రదర్శిస్తున్నాము, దీనికి తెలుగు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు