మూడో వారం కూడా మంచి వసూళ్లతో దూసుకు పోతున్న “మంజుమ్మల్ బాయ్స్”

మూడో వారం కూడా మంచి వసూళ్లతో దూసుకు పోతున్న “మంజుమ్మల్ బాయ్స్”

Published on Apr 21, 2024 10:01 PM IST

మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమ్మల్ బాయ్స్ (Manjummel boys) ఏప్రిల్ 6, 2024న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్‌ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మూడో వారం లోకి అడుగు పెట్టిన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ప్రముఖ టికెటింగ్ యాప్ అయిన బుజ్ మై షో లో గత 24 గంటల్లో 10 వేలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ రెస్పాన్స్ సూపర్ అనే చెప్పాలి.

స్నేహితుల బృందం కొడైకెనాల్‌కు వెళుతుంది, వారిలో ఒకరు గుణ గుహలను సందర్శించినప్పుడు అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అతడిని ఇతరులు ఎలా కాపాడారనేదే సినిమా. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు