ఆకట్టుకుంటున్న “మంజుమ్మెల్ బాయ్స్” తెలుగు ట్రైలర్!

ఆకట్టుకుంటున్న “మంజుమ్మెల్ బాయ్స్” తెలుగు ట్రైలర్!

Published on Mar 31, 2024 6:57 PM IST

మలయాళ పరిశ్రమలో కొత్త ఇండస్ట్రీ హిట్ అయిన మంజుమ్మెల్ బాయ్స్ ఏప్రిల్ 6, 2024న తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సర్వైవల్ థ్రిల్లర్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈరోజు, మేకర్స్ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్నేహితుల బృందం కొడైకెనాల్‌కు వెళుతుంది, వారిలో ఒకరు గుణ గుహలను సందర్శించినప్పుడు అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. అతడిని ఇతరులు ఎలా కాపాడారనేదే సినిమా. స్నేహితుల మధ్య బంధం సినిమాకి కీలక.

విజువల్స్, సెట్ వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్ మరియు అర్జున్ కురియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు