ఓటిటిలో భారీ ధరకి అమ్ముడుపోయిన “మంజుమ్మల్ బాయ్స్” ?

ఓటిటిలో భారీ ధరకి అమ్ముడుపోయిన “మంజుమ్మల్ బాయ్స్” ?

Published on Apr 24, 2024 2:30 PM IST

ప్రస్తుతం మళయాళ సినిమా దగ్గర వస్తున్న చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ అవుతున్నాయి. మరి అలా వచ్చిన చిత్రాల్లో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా “మంజుమ్మల్ బాయ్స్” కూడా ఒకటి. మరి ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ లు నటించగా ఇప్పుడు దాదాపు థియేటర్స్ లో రన్ ని ఈ సినిమా కంప్లీట్ చేసుకోవచ్చింది.

అయితే ఈ చిత్రం ఓటిటిలో ప్రముఖ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ (Manjummel Boys OTT) లో రానున్న సంగతి తెలిసిందే. ఇంకా డేట్ ఖరారు కాలేదు కానీ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ ఉంటుంది అని నిన్ననే హాట్ స్టార్ వారు కన్ఫర్మ్ చేశారు. అయితే మంజుమ్మల్ బాయ్స్ కి ఓటిటిలో భారీ ధర పలికినట్టుగా తెలుస్తుంది. హిట్ అయ్యాక ఈ సినిమాకి ఏకంగా 20 కోట్ల ఆఫర్ వచ్చిందట.

మొదట చాలా తక్కువ అంచనాలు లిమిటెడ్ గానే మళయాళంలో రిలీజ్ కాగా నెక్స్ట్ ఈ సినిమా మళయాళం సహా తమిళ్, తెలుగులో కూడా సత్తా చాటడంతో ఈ భారీ మొత్తంలో అదనంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ భారీ లాభాలని అందుకున్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు