తెలుగులో “మంజుమ్మల్ బాయ్స్” రిలీజ్ కి డేట్ ఫిక్స్ !

తెలుగులో “మంజుమ్మల్ బాయ్స్” రిలీజ్ కి డేట్ ఫిక్స్ !

Published on Mar 26, 2024 6:57 PM IST


2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మల్ బాయ్స్. మలయాళం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. 200 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టిన మలయాళం చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ కి రెడీ అయిపోయింది. చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వంలో సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్ మరియు శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 6, 2024 న తెలుగు లో రిలీజ్ కానుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు వెర్షన్‌ను నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పిస్తున్నారు. షైజు ఖలీద్ కెమెరా క్రాంక్ చేయగా, సుశిన్ శ్యామ్ సంగీతం అందించారు. వివేక్ హర్షన్ ఎడిటర్, అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్. తెలుగులో కూడా మంజుమ్మల్‌ బాయ్స్‌ గా థియేటర్ల లోకి
రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు