యానిమల్‌ పై బాలీవుడ్‌ నటుడు కామెంట్స్ వైరల్

యానిమల్‌ పై బాలీవుడ్‌ నటుడు కామెంట్స్ వైరల్

Published on May 15, 2024 6:00 PM IST

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ లాంటి టాలెంటెడ్ హీరో కలయికలో వచ్చిన సినిమా యానిమల్. ఈ మూవీ భారీ కలెక్షన్స్ ను సాధించి.. అద్భుత విజయాన్ని సాధించింది. ఐతే, ఈ సినిమా పై ఎన్నో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విమర్శలపై బాలీవుడ్ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ, ఆ మనోజ్‌ బాజ్‌ పాయ్‌ ఏం కామెంట్స్ చేశాడంటే.. ‘సినిమా ఎలా ఉండాలి ? అనే విషయంలో చాలామంది వ్యక్తులు ఒకే అంశం పై ఏకీభవించకపోయినా.. నేను ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాను.

మనోజ్‌ బాజ్‌పాయ్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘కొన్ని సినిమాలపై బాగా విమర్శలు వస్తుంటాయి. కానీ ఆ సినిమాలు బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తాయి. ఉదాహరణకు ‘యానిమల్‌’ విడుదలైన తర్వాత, ఆ సినిమా ఎంతోమంది విమర్శించారు. అయినా, అది భారీ స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టింది. పైగా 2023 హిట్ చిత్రాల్లో యానిమల్ సినిమా ఒకటిగా నిలిచింది. విమర్శించిన కంటెంట్‌ అందులో ఉందో, లేదో చూడడానికి ప్రేక్షకులు వెళ్లారేమో’ అని మనోజ్‌ బాజ్‌పాయ్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు