స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మంచు మనోజ్ కాంబినేషన్ మళ్ళీ తెర పైకి వచ్చేలా ఉంది. బన్నీ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప’ సినిమాలో మంచు మనోజ్ నటించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ సేతుపతి చేయాల్సిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనోజ్ నటించబోతున్నాడట. అల్లు అర్జున్ – మంచు మనోజ్ గతంలో వేదం సినిమాలో కలిసి నటించారు.
ఆ రకంగా మనోజ్ – బన్నీలది హిట్ కాంబినేషన్. ఇక వచ్చే షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై ఓ రొమాంటిక్ సాంగ్ ను కూడా షూట్ చేస్తారని.. ఈ సాంగ్ తరువాత సినిమాలోని స్పెషల్ సాంగ్ షూట్ ను కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది. అలాగే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న ఈ సినిమాలో ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.
