మేలో ప్లాన్ చేసుకుంటున్న ‘మంచు మనోజ్’ !

Published on Mar 22, 2020 9:30 am IST

రాకింగ్ స్టార్ మంచు మనోజ్‌ ఇప్పటికే సినిమాలకు చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్.. ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. కాగా, ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మే నుండి మొదలుకానుంది.

అలాగే మే నెల ఫస్ట్ వీక్ నుండి ఫైట్ మాస్టర్ పీటర్ హేన్స్ కంపోజింగ్ లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ చేయనున్నాడు. అన్నట్టు ఈ షెడ్యూల్ మొత్తం హైదరాబాద్ లోనే జరగనుంది. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేయాలని ‘ఎమ్ఎమ్‌ ఆర్ట్స్‌’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More