‘మంచు’ వారింట పెళ్ళి సందడి..!

Manoj-(3)
మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ పెళ్ళికి సిద్ధమైన విషయం తెలిసిందే. హైద్రాబాద్‌లోని హైటెక్స్‌లో ఈనెల 20న హై ప్రొఫైల్‌లో పెళ్ళి వేడుక జరగనుంది. ఇక పెళ్ళికి ఐదు రోజులుండగా ఇప్పటికే మంచు వారింట పెళ్ళి సందడి మొదలైంది. నేడు (మే 14న) మనోజ్‌ను పెళ్ళి కుమారుడ్ని చేశారు. ఈ ‘నలుగు’ ఫంక్షన్‌ను మోహన్ బాబు ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నిర్వహించారు. నలుగు పెట్టుకొని పెళ్ళి కుమారుడిగా తయారైన మనోజ్ సిగ్గు పడుతూ ఓ ఫోటోను ట్వీట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు.

మే 20న జరగనున్న పెళ్ళి వేడుకకు సంబంధించిన ప్రతిదీ రిచ్‌గా ఉండేలా మంచు ఫ్యామిలీ ప్లాన్ చేసింది. వెడ్డింగ్ కార్డు దగ్గరనుండి, వేదిక వరకూ అన్నింటినీ మంచు ఫ్యామిలీ రేంజ్‌కు తగ్గట్టుగా ప్లాన్ చేశారు. ఈ ఆదివారం ఓ సంగీత్ ఫంక్షన్‌ను కూడా ఏర్పాటు చేశారు. పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో సినీ ప్రముఖుల హడావుడి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మంచు మనోజ్ పెళ్ళితో అటు కుటుంబ సభ్యులు, అభిమానులూ ఆనందంలో మునిగిపోయారు.

Exit mobile version