హాట్ అండ్ బబ్లీ గర్ల్ ఛార్మీ కొద్ది రోజుల క్రితమే ‘జ్యోతిలక్ష్మీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమా విడుదలై నెల రోజులైంది, కానీ అప్పుడే ఛార్మీ మరో మూవీతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్దమైంది. ఆ సినిమానే సూపర్ హిట్ మూవీ మంత్ర’కి సీక్వెల్ గా వస్తున్న ‘మంత్ర 2’. కెరీర్ మొదట్లో చార్మింగ్ బ్యూటీ చార్మీ చేసిన గ్లామరస్ రోల్స్ ఎంత పేరు తీసుకొచ్చాయో, అంతకు మించి గుర్తింపు తెచ్చిన మూవీ ‘మంత్ర’.
దానికి కొనసాగింపుగా హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ‘మంత్ర 2’ సినిమాని జూలై 31న రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం నిర్ణయించింది. ముందుగా పలు డేట్స్ అనుకున్నా ఫైనల్ గా జూలై 31న రిలీజ్ చేయడానికే ఈ చిత్ర టీం ఫిక్స్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘మంత్ర’ సినిమాని మించి ‘మంత్ర 2’ ఉంటుందని అంటున్న ఈ సినిమా ద్వారా కెవి సతీష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. బోనాల శ్రీకాంత్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మరి ఈ సీక్వెల్ మొదటి పార్ట్ కంటే ఎక్కువ మెప్పిస్తుందా లేదా అన్నదాని కోసం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..


