పెళ్లి తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అమలా పాల్..!

పెళ్లి తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అమలా పాల్..!

Published on Jul 21, 2014 11:28 PM IST

amala-paul
‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాల హీరోయిన్ అమలా పాల్ దర్శకుడు ఏయల్ విజయ్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ అందాల భామ సినిమా కెరీర్ కు గుడ్ బై చెప్పెస్తుందని అంతా భావించారు. అటువంటిది ఏమి లేదని, మ్యారేజ్ తర్వాత సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పింది.

ధనుష్ సరసన అమలా పాల్ నటించిన ‘వేలి ఇళ పట్టతరి’ ఘన విజయం సాదించింది. అమలా పెళ్లి తర్వాత విడుదలైన తోలి చిత్రమిది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో అమ్మడి ఆనందానికి అవధులు లేవు. కొత్త అవకశాలు కూడా వస్తున్నాయట. అందులో తనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుంటాను అని అంటుంది.

గతంలో హవిష్, అమలా ప్రధాన పాత్రలలో ‘వస్తా నీ వెనుక’ సినిమా ప్రారంభించి ఆపేసిన నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కొత్త సినిమాలో నటించమని కోరారట. అయితే అమలా పాల్ నో చెప్పానని చెప్తుంది. ప్రస్తుతం అమలా పాల్ రెండు మలయాళ సినిమాలలో నటిస్తుంది.

తాజా వార్తలు